Advertisement

మై టౌన్ స్వచ్ఛ సిద్దిపేట APP



మైటౌన్ స్వచ్ఛ సిద్దిపేట..

-రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేట లో ప్రారంభం.

-స్వచ్ఛ తెలంగాణ లక్ష్యంగా మున్సిపల్ ముందడుగు

-మోడల్ మున్సిపల్‌గా తీర్చిదిద్దడంలో కమిషనర్, సిబ్బంది పనితీరు భేష్ 
 ప్రజా సమస్యలకు యాప్‌తో చెక్ పడనుంది..! ఇక నుంచి సులభతరమైన సేవలు లభించేలా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పట్టణ వాసులకు యూజర్ ఫ్రెండ్లీ సేవలు అందించేలా సరికొత్త ఒరవడిని సృష్టించి (My Town_Swachh Siddipet) పేరిట మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ నేటి నుండి పూర్తిగా వినియోగం లోకి రానుంంది.

ఈ నేపథ్యంలో పాత, కొత్త పట్టణ పరిధిలో మొత్తం సుమారు 38వేల కుటుంబాలు ఉండగా ప్రతి ఇంటింటికీ ఒక్కో చెత్త బుట్టను పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపల్‌ను రాష్ర్టానికే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో రాష్ట్రమంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

పట్టణ వాసులకు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇక సులభతరమైన మున్సిపల్ సేవలు లభించనున్నాయి. రహదారిపై వెళ్తున్న సమయంలో ఎదైనా సమస్యను స్మార్ట్‌ఫోన్ కెమెరాతో క్లిమ్‌మనిపించి, ఈ యాప్ ద్వారా సంబంధిత మున్సిపల్ విభాగాలకు సమాచారాన్ని చేరవేయవచ్చు. దీంతో సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే రంగంలోకి దిగుతారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. లేదా (http://siddip etmu nicipality. in) వెబ్‌సైట్‌కు వెళ్లి స్వచ్ఛ సిద్దిపేట బ్లాగ్ క్లిక్ చేసిన వెంటనే ఆండ్రాయిడ్ యాప్ కనిపిస్తుంది. 
ఇలా ప్రత్యేకించి పట్టణ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట కల్పించింది. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఈ సౌకర్యం ప్రారంభించిన అనంతరం అందుబాటులోకి రానున్నది. మైటౌన్ స్వచ్ఛ సిద్దిపేట పేరిట రూపొందించిన ఈ యాప్‌లో కీలకమైన తొమ్మిది ఆప్లికేషన్స్ ఉన్నాయి. వీటిలో వీధిదీపాలు(స్ట్రీట్‌లైట్స్), పార్కుల నిర్వహణ (పార్క్‌మెయింటెనెన్స్), చెత్త నిర్వహణ తీరు(బిన్స్ మేనేజ్‌మెంట్), నీటి విభాగానికి చెందిన (వాటర్ రిలేటెడ్), అభివృద్ధి పనుల తీరు (వర్క్స్ మానిటరింగ్), రోడ్డు నిర్వహణ(రోడ్ మెయింటెనెన్స్), మూత్రశాలలు(పబ్లిక్ టాయిలెట్స్) ఎంఐఎస్ రిపోర్ట్స్, ఇతరత్రా ఫిర్యాదులు..గ్రీవెన్సులు స్వీకరించనున్నారు
Download 

Post a Comment

0 Comments