Advertisement

మెరుగైన విద్యకు కేంద్రీయ విద్యాలయం నిలయం


అత్యుత్తమ పాఠశాల విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాలకు మన దేశంలో మంచి పేరు ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 1100+ కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు మాత్రమే ఉండడం, కేంద్రీయ విద్యాలయాలు కేవలం కేంద్ర ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అన్న అపోహతో చాలా మంది ఈ పాఠశాలలో ప్రవేశానికి ప్రయత్నం చేయరు. 
అందరు అనుకున్నట్లు గానే, 
కెవిలో 1 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఇ అనుబంధ విద్య అందుబాటులో ఉంది.  ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు విద్య సంవత్సరంగా విద్యా బోధన కొనసాగుతుంది.  
కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు(సీట్లు) ఏ విధంగా అందిస్తున్నారు ? 
కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ పాఠశాలలో 1 నుంచి 12వ తరగతి వరకు దరఖాస్తు ప్రవేశాల కోసం స్వీకరించడం జరుగుతుంది. 
విద్యాహక్కు చట్టం ప్రకారం డ్రా పద్ధతిలో 20 సీట్లను ఎస్సీ, ఎస్టీ ,బీసీ, ఓసీలకు, ప్రత్యేక అవసరాలకు. ఇదులో ఎస్సీలకు 15శాతం, ఎస్సీలకు 7.5 శాతం సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. మిగతా 50 సీట్లను ప్రాధాన్యత క్రమంగా 
కేంద్ర ప్రభుత్వ, మరియు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 
రెండవ ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వఅటానమస్ ఇన్స్టిట్యూట్ లలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఇస్తారు.
మూడు, నాలుగోవ ప్రాధాన్యతలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అటానమస్ ఇన్స్టిట్యూట్ లలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఇస్తారు. 
ఇవన్ని పోగా మిగిలిన సీట్లు సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి.
కానీ పైన తెలిపిన ప్రాధాన్యతలో సంబందం లేకుండా ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు స్పెషల్ కెటెగరీ కిందా ఏక సంతానంగా ఉన్న బాలికలకు ఖచ్చిత ప్రవేశం మరియు ఉచిత విద్యను అందించనున్నారు.

 కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ జిల్లాలో 2018 లో ప్రారంభించారు.  ప్రతి ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 వరకు నూతన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 


KVS Admission 2019 – 20 Advertisement Release DateLast week of February 2019

Post a Comment

0 Comments