Advertisement

సిద్దిపేట జిల్లాలో ఓటర్లు 8,11,071



పునర్‌ వ్యవస్థీకరణలో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి విడివడి కొత్తగా ఏర్పాటైన మూడు జిల్లాల్లోనూ ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఓటర్ల జాబితాతో పోలిస్తే తాజాగా 77,043 మంది అదనంగా నమోదయ్యారు. పురుష ఓటర్లు 40,671, మహిళా ఓటర్లు 36,336 మంది, ఇతరులు(థర్డ్‌ జెండర్‌) 18 మంది అదనంగా  చేరారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 36,646 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 30,079, మెదక్‌ జిల్లాలో 9,326 మంది కొత్తగా నమోదయ్యారు. తాజా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో మొత్తం 21,83,873 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 10,99,110 కాగా, మహిళలు 10,84,596 మంది, ఇతరులు 167 మంది. అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 2,37,859 ఓటర్లు ఉండగా, అత్యల్పంగా సంగారెడ్డి నియోజకవర్గంలో 1,64,575 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్‌ జిల్లాలో 3,71,373, సిద్దిపేట జిల్లాలో 8,11,071 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాపై అక్టోబరు 30వ తేదీ వరకు అభ్యంతాలు తెలియజేయవచ్చు. వాటిని పరిష్కరించిన తరువాత 2019 జనవరి 4న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.

Check your voter id status : http://ceotserms1.telangana.gov.in/TS_Search/search.aspx


Source :Eenadu

Post a Comment

0 Comments