Advertisement

Siddipet District Officers Details




I
సీఎం దత్తతగ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడంలో కీలకంగా వ్యవహరించిన జిల్లా సంయుక్త పాలనాధికారి వెంకటరామరెడ్డికి సిద్దిపేట జిల్లా తొలి కలెక్టర్‌గా అవకాశం దక్కింది.

వ్యక్తిగతాలు ఇలా...

* పి.వెంకటరామరెడ్డి: సిద్దిపేట జిల్లా కలెక్టరుగా నియమితులైన ఆయన ఇప్పటివరకు మెదక్‌ జిల్లా సంయుక్తపాలనాధికారిగా పనిచేస్తున్నారు. మార్చి 24న, 2015లో మెదక్‌ జేసీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం దత్తత గ్రామాల అభివృద్ధితో పాటు రెవెన్యూశాఖలోనూ తనదైన ముద్రవేశారు. గతంలోనూ మెదక్‌జిల్లాలో పనిచేసిన అనుభవముంది. 2002-04 మధ్యకాలంలో డ్వామా పీడీగా, 2009లో కొన్ని నెలల పాటు అదనపు సంయుక్తపాలనాధికారిగా పనిచేశారు. వీరి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి. నల్లగొండ జిల్లా కలెక్టరుగా పనిచేసిన సత్యనారాయణరెడ్డి ఆయన సోదరుడు.






​* సిద్దిపేట జిల్లా తొలి పోలీస్‌ కమిషనర్‌గా వి.శివకుమార్‌ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లా. 1994లో గ్రూపు-1కు ఎంపికయ్యారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి డీఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత కాలంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా, కరీంనగర్‌లో ఆరునెలల పాటు ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. 2005లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన అనంతరం స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి డీసీపీగా, కరీంనగర్‌ జిల్లా ఎస్పీగానూ పనిచేశారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖలో సంయుక్త సంచాలకుడిగా పని చేస్తున్నారు.


గజ్వేల్‌ ప్రాంత అభివృద్ధి అథారిటీ(గడా) ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న హనుమంతరావు ఇకపై సిద్దిపేట జిల్లా సంయుక్త పాలనాధికారిగా విధులు నిర్వర్తించనున్నారు. నల్గొండ జిల్లా చిలుకూరు మండలం బ్యాతోలు గ్రామానికి చెందిన ఆయన జూన్‌ 14, 2014 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో సిద్దిపేట ఆర్డీవోగానూ పనిచేసిన అనుభవముంది. మహబూబ్‌నగర్‌లోనూ ఆర్డీవోగా చేశారు.

Post a Comment

0 Comments