Advertisement

♦ కొత్త జిల్లాలుగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట♦ 15 లక్షలలోపు జనాభాకే ప్రాధాన్యం♦ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిన కలెక్టర్♦ సిద్దిపేట ఏర్పాటు విషయంలో స్పష్టత


​మూడు జిల్లాలు ఎలా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయంలో జిల్లా యంత్రాంగం రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లా భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోనుంది. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జి ల్లాను మూడు జిల్లాలుగా మార్చేందుకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ రోడ్ మ్యాప్‌ను రూపొందించారు. కొత్త జిల్లా కేంద్రానికి చివరి మండల కేంద్రం కనీసం 70 కిలో మీటర్ల లోపు ఉండాలనే నిబంధనలకు లోబడి  జిల్లా రోడ్ మ్యాప్‌ను విభజించారు. ఇందులో చిన్న చిన్న మార్పులతో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది.








సిద్దిపేట జిల్లా.. (జనాభా: 11,90,209,  వైశాల్యం: 4,398 చ.కిలోమీటర్లు, మండలాలు: 22)



సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్‌తో పాటుగా కరీంనగర్‌జిల్లా నుంచి హుస్నాబాద్, కోహెడ్, చిగురు మామిడి, ఇల్లంతకుంట, బెజ్జంకి, వరంగల్ జిల్లా నుంచి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాలు, కొత్తగా సిద్దిపేట అర్బన్ మండలం ఏర్పడ వచ్చు. మొత్తం 22 మండలాలతో సిద్దిపేట జిల్లా రూపుదిద్దుకోవచ్చు.

  • సిద్దిపేట జిల్లాకు ఒకటే ప్రతిపాదన .కొత్తగా ఏర్పాటుకానున్న సిద్దిపేట జిల్లాకు సంబంధించి మాత్రం అధికారులు ఒకటే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

  • సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, దుబ్బాక నియోజకర్గంలోని దుబ్బాక, దౌల్తాబాద్‌, మిరుదొడ్డి, తొగుట, గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేలు, వర్గల్‌, ములుగు, జగదేవ్‌పూర్‌, కొండపాకలతోపాటు కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లంతకుంట, హుస్నాబాద్‌, చిగురుమామిడి, సైదాపూర్‌, కోహెడ మండలాలు, వరంగల్‌ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించనుంది. ఈ జిల్లాలో కొత్తగా సిద్దిపేట అర్బన్‌ మండలంతోపాటు నారాయణరావుపేట కేంద్రంగా మండలం ఏర్పడుతుంది. 

  • సిద్దిపేటకు అదనంగా గజ్వేలు రెవెన్యూ డివిజన్‌గా మారుతుంది. దీని పరిధిలో గజ్వేల్‌, వర్గల్‌, కొండపాక, ములుగు, జగదేవ్‌పూర్‌, దౌల్తాబాద్‌, చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట... ఇలా మొత్తం 10 మండలాలుంటాయి. 

  • సిద్దిపేట, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, ఇల్లంతకుంట, చిగురుమామిడి, సైదాపూర్‌, కోహెడ, హుస్నాబాద్‌.. ఇలా 12 మండలాలు సిద్దిపేట డివిజన్‌లోకి వస్తాయి

  •  ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో కలిపేందుకు ప్రణాళిక రూపొం దించారు. అయితే బెజ్జంకి దక్షిణ వైపున్న గ్రామాలు సిద్దిపేటలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 7కిలో మీటర్ల పరధిలో 20 గ్రామాలు గుండ్లపల్లికి చుట్టూ ఉంటాయి.  ఈ గ్రామాలను బెజ్జంకి నుంచి వేరు చేసి గుండ్లపల్లిని మండల కేంద్రంగా చేసి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారు









సంగారెడ్డి జిల్లా ..  (జనాభా: 11,86,280..  వైశాల్యం: 3,116 చ.కిలోమీటర్లు, మండలాలు: 18)



పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, జహీరాబాద్ అర్బన్, కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంఘం, కంది మండల కేంద్రంగా సంగారెడ్డి రూరల్ గ్రామాలు, అమీన్‌పుర్ మండల కేంద్రంగా పటాన్‌చెరు రూరల్ గ్రామాలు వచ్చే అవకాశం ఉంది. మరో రెండు కొత్త మండలాలు కలిపి మొత్తం 18 మండలాలతో జిల్లా ఏర్పడనుంది.








మెదక్ జిల్లా ..  (జనాభా: 14,44,955, వైశాల్యం: 4,215 చ . కిలోమీటర్లు, మండలాలు: 25



పుల్కల్, తూప్రాన్, చేగుంట, మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, నారాయణఖేడ్, నారాయణఖేడ్ అర్బన్, మనూరు, కంగ్టి, కల్హేర్, పెద్దశంకరంపేట, కొత్తగా గుమ్మడిదల మండల కేంద్రంగా జిన్నారం రూరల్ గ్రామాలు, మెదక్ అర్బన్ మండలం, సిర్గాపూర్ మండల కేంద్రంగా కంగ్టిలోని కొన్ని గ్రామాలు, కల్హేర్‌లోని మరి కొన్ని గ్రామాలు, నిజామాబాద్ జిల్లా తాడ్వాయి, నాగిరెడ్డిపల్లి, ఎల్లారెడ్డి మండలాలు కలిసే అవకాశం ఉంది. మొత్తం 25 మండలాలతో మెదక్ జిల్లా ఏర్పడనుంది. 

Post a Comment

0 Comments